డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
- డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం
- అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి
- మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ
- ఫలితాల జాబితాలు వెబ్‌సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి
- ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తున్న అపోహలు, ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పష్టతనిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో జరిగిందని, అక్రమాలకు, అవకతవకలకు ఎలాంటి ఆస్కారం లేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అనుసరించిన విధానాలను వివరంగా వెల్లడించారు.
అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్
డీఎస్సీ పరీక్షలను దేశంలో అత్యంత విశ్వసనీయమైన టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహించామని శశిధర్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌టీఏ, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌తో పాటు పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు.
ఈ విధానంలో ప్రశ్నపత్రాలు 256-బిట్ ఎన్‌క్రిప్షన్ పద్ధతిలో పరీక్షా కేంద్రాలకు వెళతాయని, ప్రతి అభ్యర్థికి ప్రశ్నలు జంబుల్డ్ పద్ధతిలో వేర్వేరుగా వస్తాయని వివరించారు. దీనివల్ల మానవ ప్రమేయానికి గానీ, మ్యానిపులేట్ చేయడానికి గానీ ఎక్కడా అవకాశం లేదని, ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్‌పై అలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు. ఇది పాత పద్ధతిలో ఓఎంఆర్ షీట్లపై పెన్సిల్‌తో రాసి, వాటిని స్కాన్ చేసే విధానం కాదని, పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే పటిష్టమైన ప్రక్రియ అని తెలిపారు.
పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్ వంటి నగరాల్లో కలిపి మొత్తం 154 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కేంద్రాలన్నింటినీ ముందుగానే ప్రభుత్వ, టీసీఎస్ బృందాలు తనిఖీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎంపిక చేశామని చెప్పారు.
మార్చి 6 నుంచి ఏప్రిల్ 2 వరకు సుమారు 24 రోజుల పాటు 89 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రభుత్వ, టీసీఎస్ ఇన్విజిలేటర్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని, అలాంటి సమాచారం కూడా తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.
ఫలితాల ప్రకటనలో పూర్తి పారదర్శకత
ఫలితాల విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవమని కోన శశిధర్ కొట్టిపారేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే మే 5న ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించి జూన్ 1న తుది కీ విడుదల చేశామని తెలిపారు.
వేర్వేరు సెషన్లలో పరీక్షలు జరిగినందున, శాస్త్రీయమైన నార్మలైజేషన్ విధానంలో స్కోర్‌లను లెక్కించి, జూన్ 11న డీఎస్సీ స్కోర్లను, జూన్ 22న టెట్-డీఎస్సీ కలిపిన స్కోర్లను అన్ని జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో ప్రచురించామని చెప్పారు. ఆ జాబితాలు ఇప్పటికీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటిని తొలగించారనడంలో వాస్తవం లేదని అన్నారు. కొందరికి మాత్రమే పంపారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
దరఖాస్తుల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు
ప్రారంభంలో దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని నిబంధన పెట్టామని, అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సమర్పించేలా వెసులుబాటు కల్పించామని శశిధర్ తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ కూడా ఎక్కడా అవరోధాలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా జరిగిందని, అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రతి జిల్లాలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని వివరించారు.
మొత్తం మీద 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశామని కోన శశిధర్ స్పష్టం చేశారు.